Bigg Boss 8 Telugu: బేబక్క ఎలిమినేషన్ పక్కా.. టాప్ లో విష్ణుప్రియ!
on Sep 7, 2024
బిగ్ బాస్ సీజన్ మొదలై నేటికి ఆరు రోజులు.. రేపే ఎలిమినేషన్ ఉండబోతుంది. దీంతో నామినేషన్ లిస్ట్ లో ఉన్నవాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. తొలివారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, శేఖర్ బాషా, సోనియా , బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీ మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. (Bigg boss 8 Telugu first week elimination)
ఓటింగ్ లైన్స్ ముగిసే సమయానికి ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం.. విష్ణుప్రియ 28 శాతం ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉండగా.. మణికంఠ 26 శాతం ఓటింగ్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక పృథ్వీకి 12 శాతం, సోనియా ఆకులకి 12 శాతం, శేఖర్ బాషాకి 10 శాతం ఓటింగ్ పడగా.. చివరగా బేబక్కకి 9 శాతం ఓటింగ్ సాధించారు. ఈ ఓటింగ్ పోల్ ని చూస్తే బేబక్క ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే కొన్ని పోల్స్ లో శేఖర్ బాషా లీస్ట్ లో ఉన్నాడు.
బుధవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. దాంతో నిన్నటితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానున్నాయి. అంటే.. కేవలం రెండురోజుల ఓటింగ్‌ని బట్టి ఎలిమినేషన్ చేపట్టడమనేది కంటెస్టెంట్స్‌కి అన్యాయం జరిగినట్టే. మరి గతంలో మాదిరిగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎత్తేస్తారో లేదా ఎలిమినేట్ చేసిపారేస్తారేమో చూడాలి మరి.
Also Read